- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుట్ర పూరితంగా నాపై దుష్ప్రచారం: ఎమ్మెల్సీ నవీన్ కుమార్
‘నాకు ఫోన్ ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం లేదు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నాకు ఫోన్ ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం లేదు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన గురించి గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న, చేస్తున్న ప్రచారం అవాస్తవం అన్నారు. తన గెస్ట్ హౌస్‌లో ఎలాంటి తనిఖీలు జరగలేదన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నది తప్పు అన్నారు. తన గెస్ట్ హౌస్‌లో, ఇంట్లో ఎలాంటి పోలీసు తనిఖీలు జరగలేదని స్పష్టం చేశారు. కుట్రపూరితంగా తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, తప్పుడు కథనాలు రాసినవారిపై లీగల్‌గా కోర్టులో కేసు వేస్తానని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.






