దేవుడిపైనే దండెత్తుతావా? క‌విత‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫైర్

by Ajay Maddhiboyina |

క‌విత చిట్ చాట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు స్పందించారు. కవిత మాట్లాడిన మాటలు క్షమించరానివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవుడిపైనే దండెత్తుతావా? క‌విత‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: క‌విత చిట్ చాట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు స్పందించారు. కవిత మాట్లాడిన మాటలు క్షమించరానివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయని అన్నారు. లేఖలోని అంశాలు బయటకు వచ్చిన తరవాత కేసీఆర్ సమాధానం ఇచ్చే వరకు వేచి చూడాలి క‌దా అన్నారు. ఆయన స్పందించిన తరవాత మాట్లాడాలని చెప్పారు. కానీ కవితకు అంత ఆవేశం ఎందుకు అని ప్రశ్నించారు. కొంచెం అయినా ఓపిక ఉండాలన్నారు.

కేసీఆర్ మీకే కాదు లక్షలాది మంది ప్రజలకు దేవుడు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాళేశ్వరం గురించి నోటీసులు వచ్చాయని దాని గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వేధిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలో ఏం కొంపలు అంటుకుపోయాయని కవిత ఆవేశపడుతున్నారని అన్నారు. కేసీఆర్ ఎటు వెళతారు, అంశాలు ఎటు వెళతాయి అని ప్రశ్నించారు. లేఖలోని అంశాల గురించి కేసీఆర్ చూసుకుంటారని ఆయనను దేవుడు అని ఆయన ఆదేశాలు ఇచ్చేంతవరకు ఎందుకు ఆగడంలేద‌ని మండిప‌డ్డారు. దేవుడి మీదనే దండెత్తుతావా? అంటూ ర‌వీందర్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Next Story