- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS Vs Kavitha: 'సిగ్గు, లజ్జ వదిలేసి..' కవితపై రెచ్చిపోయిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
కవిత వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంటోంది. కవిత చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ (BRS Party) వైపు నుంచి స్ట్రాంగ్ కౌంటర్స్ వస్తున్నాయి. కవితపై ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎటాక్ చేయగా తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు (Takkellapalli Ravinder Rao) తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. కవిత సిగ్గు, లజ్జ వదిలేసి బరితెగించి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, పార్టీ మీద మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాగే పిచ్చికూతలు కూస్తే ఎక్కడో ఒక చోట మహిళలే కవితను కొడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ టీవీ డిబెట్‍లో మాట్లాడినతక్కెళ్లపల్లి రవీందర్ రావు.. తాను మాత్రమే మాట్లాడాలని కవిత భావిస్తున్నారని ఒక వేళ తనకు కౌంటర్ ఇస్తే మీ బట్టలు ఊడతీస్తా అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఇక కవిత విషయంలో సంయమనం పాటించే అవసరం లేదన్నారు. కచ్చితంగా కవితకు నడి బజార్లో జవాబు చెబుతారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కవిత తన స్థాయి మరిచి దిగజారి మాట్లాడుతున్నారని ఆమె వ్యాఖ్యలు మహిళా జాతికే అవమానకరంగా ఉన్నాయన్నారు. అలాంటి మహిళా పట్ల ఇంకెంతసేపు సంయమనం పాటిస్తామని ప్రశ్నించారు. తాను ఇంకా టాస్ మాత్రమే వేశానని టెస్ట్ మ్యాచ్ ముందుంది అన్న కవిత వ్యాఖ్యలపై స్పందిస్తూ టెస్ట్ మ్యాచ్ లేదు చెత్తా లేదన్నారు. కవితకు ప్రాధాన్యత ఇస్తే మన పరువు పోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రజల సమస్యలపై మాట్లాడకుండా బీఆర్ఎస్‍పై ప్రశ్నించడం ఏమిటని నిలదీశారు. కవిత కేసీఆర్ కడుపున చెడపుట్టిందని ఫైర్ అయ్యారు.. కేసీఆర్ కుటుంబంపై ఇంతలా మాట్లాడుతున్నారంటు తోటి ప్యానలిస్టులు అనగా హే.. కేసీఆర్ లేదు ఏమి లేదు.. కవిత చిల్లర మాటలు మాట్లాడుతుంటే, పార్టీని ఆగం చేస్తుంటే ఎంతబాధ అవుతోందని వ్యాఖ్యానించారు. కవిత ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడటం సరికాదన్నారు.






