- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీల హక్కులపై రేవంత్ కుట్ర : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
రాష్ట్రంలో బీసీలు, మహిళల హక్కులను క్రమపద్ధతిగా హరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగంగా కుట్రకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఒక ప్రకటనలో ఆరోపించారు.

- రిజర్వేషన్లలో మహిళలకూ ఘోర అన్యాయం
- రాజ్యాంగాన్ని కాలరాస్తున్న తెలంగాణ ప్రభుత్వం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీసీలు, మహిళల హక్కులను క్రమపద్ధతిగా హరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగంగా కుట్రకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. కులగణన పేరిట సుమారు రూ.200 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి, బుసాని వెంకటేశ్వర్లు కమిషన్, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కమిషన్ అంటూ బూటకపు కమిటీల పేరుతో రెండేళ్లు ప్రజలను ప్రభుత్వం మభ్యపెట్టిందని పేర్కొన్నారు. చివరికి జీవో 46ను తెచ్చి బీసీలకు రావాల్సిన రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లను కత్తిరించిందని ఆరోపించారు. ఈ జీవో ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని పూర్తిగా ప్రభుత్వానికి లోబడి పనిచేసే సంస్థగా మార్చి, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం అత్యంత ప్రమాదకర పరిణామమని తెలిపారు. అనేక జిల్లాల్లో బీసీల రిజర్వేషన్లను కొల్లగొట్టడం సామాజిక ద్రోహమే అని పేర్కొన్నారు. మహిళలకూ 50 శాతం రిజర్వేషన్ అంటూ అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామ పంచాయతీలోనూ 50 శాతం దాటలేదని తెలిపారు. రాష్ట్రంలో అమలులో ఉన్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదని.. అనుముల రాజ్యాంగమని.. ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.






