BRS MLC: ఫామ్‌హౌజ్‌‌లో కోడి పందేలు.. క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

by Shiva |
BRS MLC: ఫామ్‌హౌజ్‌‌లో కోడి పందేలు.. క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదారాబాద్ నగర శివారులోని తొల్కట్ట (Tolkatta)లో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (Pochampally Srinivas Reddy) ఫామ్‌ హౌస్‌లో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తుండగా.. మొత్తం 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఉదయం ఫామ్ హౌజ్ యజమాని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ (Moinabad) పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, అదే ఫాంహౌజ్‌లో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని కోనసీమ (Konaseema) జిల్లా కాట్రేనికోన (Katrenekona) మండలానికి చెందిన వ్యాపారి భూపతిరాజు శివకుమార్‌ వర్మ (Bhupatiraju Shiva Kumar Varma) అలియాస్‌ గబ్బర్‌సింగ్‌ (Gabbar Singh) పందేలు నిర్వహించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

ఈ క్రమంలోనే పోలీసుల నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (Pochampally Srinivas Reddy) తాజాగా, ఫామ్‌హౌజ్ వివాదంపై స్పందించారు. కోడిపందేలతో తనకు సంబంధం లేదని, పందేలు నిర్వహించిన ఫామ్‌హౌజ్ తనదేనని అన్నారు. తాను రమేష్ (Ramesh) అనే వ్యక్తికి ఫామ్‌హౌజ్‌ను లీజుకు ఇచ్చానని.. కానీ, అతడు ఇంకో వ్యక్తికి లీజుకు ఇచ్చాడనే విషయం తనకు తెలియదని వివరణ ఇచ్చారు. ఆ ఫామ్‌హౌజ్‌కు వెళ్లి దాదాపు ఎనిమిదేళ్లకు పైగానే అయిందని పేర్కొన్నారు. ఈ మేరకు లీజు డాక్యుమెంట్లను కూడా పోలీసులకు అందజేశానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Next Story

Most Viewed