నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్స్

by Disha Web Desk 4 |
నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం బీఆర్ఎస్ నామినేషన్స్ వేయనుంది. ఆ స్థానాలకు నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రాంరెడ్డిలను అభ్యర్థులగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం విధితమే. గురువారం మంచిరోజు ఉండటంతో నామినేషన్ వేయాలని కేసీఆర్

సూచన మేరకు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్స్ పత్రాలను నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రాంరెడ్డిలు అందజేయనున్నారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరవుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఇవి కూడా చదవండి :

రాష్ట్రంలో ఇన్‌ఫ్లుయెంజా అలర్ట్!


Next Story