అంబేద్కర్ విగ్రహం వద్ద BRS ఎమ్మెల్యేల ధర్నా

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని భారీ అంబేద్కర్ విగ్రహం(Ambedkar Statue) వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) ఆందోళనకు దిగారు.

అంబేద్కర్ విగ్రహం వద్ద BRS ఎమ్మెల్యేల ధర్నా
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని భారీ అంబేద్కర్ విగ్రహం(Ambedkar Statue) వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) ఆందోళనకు దిగారు. అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి(Jagadish Reddy)ని అక్రమంగా సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నారు. మరోవైపు.. అంతకుముందు అసెంబ్లీలోని బీఆర్ఎస్‌ఎల్పీ(BRSLP) రూమ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి మార్షల్స్ చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు(Harish Rao), కేటీఆర్(KTR), తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav).. మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు. ఎల్పీ రూమ్‌లో ఉంటే తప్పేంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ రూల్ బుక్ చూపించాలని డిమాండ్ చేశారు. అదంతా కాదు.. జగదీష్ రెడ్డి బయటకు వెళ్లాల్సిందే అని.. పంపిచేశారు. దీంతో అటు నుంచి నేరుగా ట్యాంక్ బండ్ వద్దకు వచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. ఈ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు ఆయనపై సస్పెన్షన్‌ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

Next Story