BRS vs Congress: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఫోకస్.. నేడు స్పీకర్ వద్దకు కారు పార్టీ ఎమ్మెల్యేలు

by Prasad Jukanti |

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం రోజు రోజుకు ఉత్కంఠ రేపుతోంది.

BRS vs Congress:  పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఫోకస్.. నేడు స్పీకర్ వద్దకు  కారు పార్టీ ఎమ్మెల్యేలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం రోజు రోజుకు ఉత్కంఠ రేపుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ (Speaker) కు ఆదేశిస్తూ గత నెలలో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ మారారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్.. ఈ విషయంలో అభిప్రాయం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీకి సైతం నోటీసులు ఇచ్చారు. దీంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై బీఆర్ఎస్ రిప్లయ్ ఇవ్వాలని మూడు రోజులు గడువు ఇస్తూ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీకి లేఖ రాశారు. ఈ రోజుతో ఆ గడువు ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీకి కార్యదర్శిని కలిసి తమ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

ఆ పది నియోజకవర్గాలను టార్గెట్ చేసిన బీఆర్ఎస్!:

బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) మధ్య ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు సాగుతున్నాయి. పది మంది ఎమ్మెల్యేలకు ఇటీవల స్పీకర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో గత వారం ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కడియం శ్రీహరి మినహా మిగతా 9 మంది ఎమ్మెల్యేలు సమావేశమై.. స్పీకర్ నోటీసులు, సుప్రీంకోర్టు ఆదేశాలపై కీలక చర్చలు జరిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేసినట్లు టాక్. అవసరం అయితే ఉప ఎన్నికలకు సైతం వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ సైతం పార్టీ మారిన ఎమ్మెల్యేలను మరింతగా టార్గెట్ చేయడం రాష్ట్ర రాజకీయాలను మరింత ఆసక్తిగా మారుస్తున్నాయి. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే సవాల్ చేస్తున్నారు. నిన్న గద్వాల నియోజకవర్గంలోనూ పర్యటించడం వెనుక పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై గులాబీ పార్టీ నజర్ వేసిందనే చర్చ జరుగుతోంది. క్యాడర్ లో ధైర్యాన్ని నూరిపోసేందుకే కేటీఆర్ ఈ పర్యటనలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి కేటీఆర్ సవాళ్ల, పర్యటనలకు సీఎం అధికార పక్షం ఎలా కౌంటర్ ఇస్తుందో అనేది ఆసక్తిగా మారింది.

Next Story