- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి : అసెంబ్లీలో గందరగోళం
రాఘవ్ కన్ స్ట్రక్షన్స్ విషయంలో మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ ప్రారంభమవ్వగా.. కొద్దిసేపటికే సభలో గందరగోళం నెలకొంది. రాఘవ కన్ స్ట్రక్షన్స్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేసి విచారణ చేయించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఇందులో భాగమైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతల నినాదాల మధ్యే సభలో మంత్రులు రెండు బిల్లులను ప్రవేశ పెట్టగా.. వాటిలో న్యాయవాదుల రక్షణ బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా హరీష్ రావు, ఇతర సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. వారి నిరసనల మధ్యే పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించడంపై బీఆర్ఎస్ నేతలు ఫైరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కాగా.. ఈ రాఘవ కన్ స్ట్రక్షన్స్ విషయంలో సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత కమిటీ ఎందుకు వేయాలి ? అని స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నించారు. ఇక రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు గన్‌పార్క్ వద్ద ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సభా సంఘం వేయాలి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాఘవ కన్ స్ట్రక్షన్ తప్పు చేయకపోతే విచారణకు భయమెందుకని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి అవినీతి సంపాదనలో సీఎంకు కూడా భాగంఉందని, అందుకే ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ను బర్తరఫ్ చేయాలని గవర్నర్ ను కలిసి విన్నవిస్తామని తెలిపారు.






