BRS MLAs: అసెంబ్లీలో స్పీకర్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎదురుచూపులు.. ఎందుకంటే?

by Ramesh Naini |

తెలంగాణ అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, వివేకానంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్‌‌లు స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు.

BRS MLAs: అసెంబ్లీలో స్పీకర్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎదురుచూపులు.. ఎందుకంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Telangana Assembly) తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీని పలువురు బీఅర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) కలిశారు. గురువారం అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, వివేకానంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్‌‌లు స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో సెక్రటరీకి వినతిపత్రం అందజేసే ప్రయత్నం చేశారు. అయితే తాను తీసుకోలేనని, స్పీకర్‌ను కలిసి ఇవ్వాలని సెక్రటరీ తేల్చి చెప్పారు. మరోవైపు స్పీకర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని సెక్రటరీ కి ఎమ్మెల్యేల మధ్య సంభాషణ జరిగింది.

ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల‌ నేపథ్యంలో కాళేశ్వరం కమీషన్ నివేదిక ముందుగా తమ పార్టీకి ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. అసెంబ్లీలో నివేదికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ అపాయింట్‌మెంట్ కోసం బీఅర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేల ఎదురు చూస్తున్నారు.

Next Story