- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Koushik Reddy : మా మీద కోపం రైతుల మీద చూపకండి.. : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి
మా మీద కోపం రైతుల చూపొద్దంటూ బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు.

దిశ, వెబ్‌డెస్క్: మా మీద కోపం రైతుల చూపొద్దంటూ బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు. లక్ష్మీ పంపు హౌజ్‌ల వద్ద ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు నీళ్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ పంపు హౌస్ వద్ 17 పంపులు రెడీ ఉన్నాయని వెంటనే పంపులను ఆన్ చేసి రైతులక నీళ్లు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. పంపులు వెంటనే ఆన్ చేసి మిడ్ మానేరుతో పాటు ఎల్‌ఎండీ నింపితే తన సెగ్మెంట్‌లోని రైతులందరికీ నీళ్లు అందుతాయన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రైతుల వేల ఎకరాల్లో నాట్లు వేశారన్నారు. హుజురాబాద్ తో పాటు కోదాడ వరకు నీళ్లు అందుతాయన్నారు. తఅసెంబ్లీ సమావేశాలు పూర్తి అయ్యేలోపు పంపు హౌస్‌లు ఆన్ చేయకపోతే అసెంబ్లీ తర్వాత హుజురాబాద్ నుంచి పెద్ద ఎత్తున రైతులను తీసుకువచ్చి పంప్ హౌస్ ఆన్ మిడ్ మానేరు, ఎల్ ఎండీ నింపుకుంటామని హెచ్చరించారు.






