- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నా భార్య ఫోన్ను CM రేవంత్ ట్యాప్ చేశాడు’.. MLA కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)పై బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)పై బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నువ్వు ఇట్లనే నోటికొచ్చినట్టు మాట్లాడితే నువ్వు ఎవరెవరితో తిరిగావో ఆ 16 మంది పేర్లు బయటపెడతా.. నువ్వు జూబ్లీహిల్స్‌లో ఎక్కడ పడుకున్నావో, దుబాయిలో ఎక్కడ పడుకున్నావో, ఢిల్లీలో ఎక్కడ పడుకున్నావో నాకు అన్నీ తెలుసు.. నేను కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చాను. నీ స్టోరీలు అన్నీ నాకు తెలుసు. మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు. ఇవి ఆరోపణలు కాదు వాస్తవాలు’ అని పాడి కౌశిక్ రెడ్డి సంలచన ఆరోపణలు చేశారు. ‘ఆఖరికి నా భార్య ఫోన్‌ను కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేశాడని కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. భార్యభర్తల ఫోన్లు ట్యాప్ చేయించి వింటున్నాడని మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించాడని, అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయడం కామన్ అని మాట్లాడారని గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్ చెయ్యడం కామన్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డిపై ఈడీ, సీబీఐ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో పాటు సొంత మంత్రుల ఫోన్లను కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసి వింటున్నాడని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి వీడియో






