BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు తీవ్ర అస్వస్థత

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-05 11:27:05  IST  )

బీఆర్ఎస్(BRS) నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(Maganti Gopinath) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు తీవ్ర అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(Maganti Gopinath) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి(Gachibowli AIG Hospital)లో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న హరీష్ రావు సహా పార్టీ ముఖ్య నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. అస్వస్థతకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మాగంటి గోపీనాథ్ వారం రోజుల క్రితం కూడా ఆసుపత్రిలో చేరారు. కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మాగంటి పరిస్థితిపై కుటుంబ సభ్యులను అడిగి మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు సమాచారం.

Next Story