- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS MLA లాస్య నందిత మృతి.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వియషం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వియషం తెలిసిందే. ఇక, లాస్య నందిత మృతి పట్ల టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఈ రోజు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. తండ్రి సాయన్య చనిపోయిన ఏడాది లోపే ఆమె మృతి చెందడం దురదృష్టకరం. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆమె విధి బలితీసుకుంది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Next Story






