BRS MLA: ఎంత రాత్రివరకైనా అసెంబ్లీలో ఉంటాం

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్(KP Vivekananda Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.

BRS MLA: ఎంత రాత్రివరకైనా అసెంబ్లీలో ఉంటాం
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్(KP Vivekananda Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం దొంగచాటుగా అసెంబ్లీలో బిల్లులు ప్రవేశ పెడుతోందని విమర్శించారు. రైతులు యూరియాతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో, వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో కూడా మేము సభకు హాజరు అయ్యామని అన్నారు. ఒకవైపు అసెంబ్లీలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చకు నిర్ణయించి.. సీఎం రేవంత్ రెడ్డ కేరళకు వెళ్లారని విమర్శించారు. కాంగ్రెస్ హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకోవడం మీదున్న దృష్టి ప్రజలపై లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే సభ పెట్టారని అన్నారు. కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే నింద వేసే ప్రయత్నం చేస్తున్నారని సీరియస్ అయ్యారు.

‘హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత సుమారు 665 పేజీల నివేదిక ఇచ్చారు. ఈరోజే ఇస్తే చదువుకుని సమాధానం ఎలా చెప్పాలి. ఇది రాజకీయ నీతి అనిపించుకోదు. సొంత పార్టీ నేతల సలహాలు తీసుకోని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అధికార మదంతో నాకు తిరుగులేదు అనేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాకు మైక్ కట్ చేయకుండా ఇస్తే.. రాత్రి వరకైనా చర్చలో పాల్గొంటామని ప్రకటించారు.

Next Story