- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా కమిషన్ ఎదుట హాజరైన BRS ఎమ్మెల్యే.. వివరణ అనంతరం కీలక ప్రకటన
బీఆర్ఎస్(BRS) కీలక నేత, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(Devireddy Sudheer Reddy) మహిళా కమిషన్(Women's Commission) ఎదుట హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) కీలక నేత, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(Devireddy Sudheer Reddy) మహిళా కమిషన్(Women's Commission) ఎదుట హాజరయ్యారు. ఎస్టీ మహిళా కార్పొరేటర్ అయిన సుజాత(Corporator Sujatha)పై ఎమ్మెల్యే ఇటీవల అనుచిత వ్యా్ఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు మహిళా కమిషన్‌లో కంప్లైంట్ చేశారు. దీంతో వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. తనను అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు సుధీర్ రెడ్డి చెప్పారు. రాజకీయ కక్షతోనే తనపై ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. ప్రజల్లో తనకున్న ఆదరణను చూసి ఓర్వలేక.. కొందరు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ అంశాన్ని అంత ఈజీగా వదిలిపెట్టబోనని.. తప్పకుండా లీగల్‌గా పోరాటం చేస్తానని కీలక ప్రకటన చేశారు. కాగా, ఎల్బీనగర్ నియోజకవర్గం(LB Nagar Constituency) పరిధిలోని హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాతా నాయక్‌ను ఉద్దేశించి సుధీర్ రెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్టీ మహిళా కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్‌పై అసభ్యకర వ్యాఖ్యలకు చేసినందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారదకు ఫిర్యాదు చేశారు. ఒక ఎస్టీ మహిళను కాబట్టే తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని కమిషన్ ముందు సుజాత కన్నీంటి పర్యంతమయ్యారు. ఈ వ్యవహారాన్ని మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకున్న మహిళా కమిషన్ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది.






