విదేశాల్లో చిల్ అవుతున్న BRS MLA.. సీఎం కేసీఆర్ సీరియస్!

by Disha Web Desk 4 |
విదేశాల్లో చిల్ అవుతున్న BRS MLA.. సీఎం కేసీఆర్ సీరియస్!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి‌పై ప్రజా ఆగ్రహం పెరుగుతుంది. ఉప్పల్‌లో అకాల వర్షాలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే బేతి నేపాల్‌లో విహార యాత్రలు చేపట్టడం పలు విమర్శలకు తావిస్తోంది. స్వంత ప్రయోజనాలు తప్ప ఉప్పల్ నియోజకవర్గం సమస్యలు పట్టవా అంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఈ ఎమ్మెల్యే తీరుపై మొదటి నుండి ఎన్నోసార్లు వివాదాలు నెలకొన్నాయి.

పనితీరు మార్చుకుని ప్రజావ్యతిరేకత తగ్గించుకోవాలని సీఎం పలు మార్లు బేతిని హెచ్చరించినప్పటికి బేతిలో మార్పు రాకపోవడం పట్ల బీఆర్ఎస్ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మొన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లో సీఎం 40 మంది ఎమ్మెల్యేల తీరు సరిగ్గా లేదని వారి పని తీరు మార్చుకోకపోతె వచ్చే ఎన్నికలలో టికెట్ కష్టం అని వార్నింగ్ ఇచ్చారు. సీఎం వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఉప్పల్ ఎమ్మెల్యే తీరులో ఏమాత్రం మార్పు రాలేదని పలువురు ఆరోపిస్తున్నారు. తన ఎమ్మెల్యే సీటు కాపాడుకునేందుకు నేపాల్‌లో అసంతృప్త కార్పొరేటర్‌లతో విహార యాత్రలకు వెళ్లడం ప్రజా ఆగ్రహానికి ఆజ్యం పోస్తుంది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్ నియోజకవర్గం ప్రజలు సైతం తరచుగా వచ్చే అకాల వర్షాలతో నిత్యం సతమతం అవుతున్నారు. కానీ ఉప్పల్ ఎమ్మెల్యే నియోజకవర్గం సమస్యలు గాలికి వదిలేసి స్వంత ప్రయోజనం కోసం విహార యాత్ర చేపట్టడం పలువురిని విస్మయానికి గురిచేస్తుంది. దీంతో ఉప్పల్ ఎమ్మెల్యే సీఎం చెప్పిన 40 మంది లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వ్యవహారంపై ఉప్పల్ బీఆర్ఎస్ నాయకులు, ప్రజలలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

Read more:

తెలంగాణతో KTRకు పేరు, పేగు బంధం లేదు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మొదట్లో ఐశ్వర్య రాయ్‌ చివరకు కల్పనా రాయ్‌.. ఈటలపై రేవంత్ రెడ్డి కామెంట్స్ వైరల్ (వీడియో)

Next Story

Most Viewed