- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ED ఆఫీస్ వద్ద హైటెన్షన్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్
హైదరాబాద్‌లోని ఈడీ(Enforcement Directorate) ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఈడీ(Enforcement Directorate) ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్(KTR) విచారణ నేపథ్యంలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే గోపీనాథ్(Maganti Gopinath)ను, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman), ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ఈడీ ఆఫీస్ నుంచి వెళ్లిపోవాలని రిక్వెస్ట్ చేశారు. ఎంతకీ వినకపోవడంతో అరెస్ట్ చేశారు. అంతేకాదు.. ఈడీ ఆఫీస్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించారు. మరోవైపు కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది.
దాదాపు 7 గంటలపాటు కేటీఆర్‌ను అధికారులు ప్రశ్నించారు. కాసేపట్లో కేటీఆర్ బయటకు రానున్నారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్ ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. HMDA ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ అధికారులు ఆరా తీశారు. విదేశీ సంస్థకు రూ.45.7 కోట్ల బదిలీ వ్యవహారంపై కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో ఇప్పటికే అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు.






