ఎక్స్ అఫిషియో ఓటు కోసం ఒకే కారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ

by Prasad Jukanti |   (  Updated:2026-02-16 07:19:58  IST  )

తెలంగాణలో మేయర్, చైర్‌పర్సన్ ఎన్నికల వేళ పార్టీల మధ్య సమీకరణాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

ఎక్స్ అఫిషియో ఓటు కోసం ఒకే కారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మేయర్, చైర్ పర్సన్ ఎన్నికల కోసం పార్టీల మధ్య సమీకరణాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఎలాగైనా పీఠాలు కైవసం చేసుకునేందుకు స్థానిక నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ (Isnapur Municipality) చైర్మన్ ఎన్నిక వేళ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇక్కడ ఎక్స్ అఫిషియో ఓటర్లుగా (Ex-Officio Vote) ఉన్న స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy), మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) ఒకే కారులో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఇక్కడ మొత్తం 26 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, ఇతరులు 4 వార్డుల్లో గెలుపొందారు. అయితే మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇక్కడ బీజేపీ ఒక్క వార్డు గెలవనప్పటికీ రఘునందన్ రావు ఎక్స్ అఫిషియో మెంబర్‍గా ఎమ్మెల్యేతో కలిసి ఒకే కారులో రావడంతో జిల్లా రాజకీయాల్లో ఈ సమీకరణాలు ఆసక్తిని రేపుతున్నాయి.

Next Story