- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: రంజాన్ పండుగ దగ్గర పడుతోంది.. ఇప్పటివరకు ఒక్క సమీక్ష లేదు
మైనారిటీ సంస్థలపై కాంగ్రెస్ నేతల పెత్తనం పెరిగిపోయిందని.. మైనారిటీల సంక్షేమం కోసం ఉన్న సంస్థలు సరిగా పనిచేయడం లేదని బీఆర్ఎస్ మైనార్టీ నేతలు సయ్యద్ అక్బర్ హుస్సేన్, వహీద్ అహ్మద్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మైనారిటీ సంస్థలపై కాంగ్రెస్ నేతల పెత్తనం పెరిగిపోయిందని.. మైనారిటీల సంక్షేమం కోసం ఉన్న సంస్థలు సరిగా పనిచేయడం లేదని బీఆర్ఎస్ మైనార్టీ నేతలు సయ్యద్ అక్బర్ హుస్సేన్, వహీద్ అహ్మద్ ఆరోపించారు. సోమవారం వారు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పద్నాలుగు నెలల పాలనలో బీసీ, ఎస్సీ, మైనారిటీలకు అన్యాయం జరిగిందని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీలకు మంత్రి లేడని పేర్కొన్నారు. రంజాన్ మాసం ప్రారంభం కాబోతున్నా ఇంతవరకు సమీక్ష నిర్వహించలేదని.. ఇప్పటివరకు మైనారిటీలకు వెయ్యి కోట్లు కూడా ఇప్పటికీ ఖర్చు చేయలేదన్నారు.
కేసీఆర్ హయాంలో మైనారిటీ జీవితాల్లో వెలుగు ఉంటే ఇప్పుడు చీకటి వచ్చిందని పేర్కొన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లబ్ధిదారులకు నిధులు విడుదల కావడం లేదని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం ఓ విఫల ప్రభుత్వమని ఆరోపించారు. రాష్ట్రంలో మైనారిటీల పరిస్థితి యూపీ కన్నా దారుణంగా తయారైందన్నారు. కాంగ్రెస్ ముస్లిం నాయకులు బీఆర్ఎస్ లోకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు. మైనారిటీలకు ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపొతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని కోరారు.






