బడే భాయ్‌ కోసమేనా? కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు అన్యాయం.. బీఆర్ఎస్ మైనార్టీ నేతల కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

కాంగ్రెస్ పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ అహ్మద్ ఆరోపించారు.

బడే భాయ్‌ కోసమేనా? కాంగ్రెస్ పాలనలో మైనార్టీలకు అన్యాయం.. బీఆర్ఎస్ మైనార్టీ నేతల కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ అహ్మద్ (Imtiaz Ahmed) ఆరోపించారు. గురువారం (BRS minority leaders) మైనార్టీ నేతలు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 22 నెలల రేవంత్ పాలన (CM Revanth Reddy)లో మైనారిటీలకు కొత్తగా ఏమీ చేయక పోగా కేసీఆర్ (KCR) తెచ్చిన పథకాల్లో కోత పెడుతున్నారని అన్నారు. మైనారిటీ గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల్లో కోత పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగుల జీతాలు క్రమం తప్పకుండా పెరిగితే రేవంత్ పాలనలో తగ్గిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న బడే భాయ్‌ని సంతృప్తి పరచడానికి రేవంత్‌రెడ్డి మైనారిటీల గొంతు కోస్తున్నారా..? అని కీలక వ్యాఖ్యలు చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు తగ్గించే విధంగా తెచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ మైనారిటీ సంక్షేమ విద్యా సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు మసియుల్లా ఖాన్, ఆజం అలీ తదితరులు పాల్గొన్నారు.

Next Story