ఊర మాస్ స్టెప్పులతో మల్లారెడ్డి రచ్చ

by velandi.Saikiran |   (  Updated:2025-08-27 04:59:24  IST  )

గులాబీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి స్టెప్పులు వేశారు. ఇవాళ సాయంత్రం కెసిఆర్ సభ ఉన్న నేపథ్యంలో...

ఊర మాస్ స్టెప్పులతో మల్లారెడ్డి రచ్చ
X

దిశ, వెబ్ డెస్క్: గులాబీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి స్టెప్పులు వేశారు. ఇవాళ సాయంత్రం కెసిఆర్ సభ ఉన్న నేపథ్యంలో... ఊర మాస్క్ స్టెప్పులతో ఇరగదీసారు మాజీ మంత్రి మల్లారెడ్డి. గులాబీ పార్టీకి సంబంధించిన మాస్ సాంగ్ కు... మల్లారెడ్డి కాలు కదిపారు. గులాబీ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా... షామీర్ పేట మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద తన అనుచరులు, నేతలతో కలిసి ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు.

వరంగల్ గులాబీ పార్టీ రజతోత్సవ సభకు వెళ్లేందుకు అలియాబాద్ చౌరస్తా వద్దకు భారీ సంఖ్యలో.. నాయకులు అలాగే కార్యకర్తలు చేరుకున్నారు. వాళ్లందరిలో ఊపు తెప్పించేందుకు.... మాస్ స్టెప్పులతో ఇరగదీసారు మాజీ మంత్రి మల్లారెడ్డి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story