- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్‌లో భద్రతా సిబ్బందిని పెంచాలి.. ఎన్నికల కమిషనర్‌కు బీఆర్ఎస్ లేఖ
పోలింగ్ రోజున, దానికి ముందు తర్వాత ఏ విధమైన గందరగోళ పరిస్థితులు జరగకుండా నిశితంగా పర్యవేక్షణ చేపట్టాలని, సున్నిత ప్రాంతాలలో భద్రతా సిబ్బందిని పెంచాలని బీఆర్ఎస్ నేతలు ఈసీని కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పోలింగ్ రోజున, దానికి ముందు తర్వాత ఏ విధమైన గందరగోళ పరిస్థితులు జరగకుండా నిశితంగా పర్యవేక్షణ చేపట్టాలని, సున్నిత ప్రాంతాలలో భద్రతా సిబ్బందిని పెంచాలని (BRS) బీఆర్ఎస్ నేతలు ఈసీని కోరారు. (Congress) కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు సోమవారం లేఖ రాశారు. కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్‌యాదవ్ తండ్రి వి.శ్రీశైలంయాదవ్, సోదరుడు వి.రమేశ్‌యాదవ్‌కు ఇటీవల హైదరాబాద్ సిటీ పోలీసులు జారీచేసిన బైండోవర్ అంశాన్ని లేఖలో పేర్కొన్నారు. వీరి వల్ల ఎన్నికల సమయంలో శాంతికి భంగం కలిగే అవకాశం ఉంటుందని, నేర, సంఘ విద్రోహ, బెదిరింపు కార్యకలాపాలలో చరిత్ర ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీస్ శాఖ తీసుకున్న చర్యల్లో భాగమని లేఖలో పేర్కొన్నారు.
శ్రీశైలంపై రౌడీషీటర్‌గా, భూ వివాదాలు, బెదిరింపులు, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులు ఉన్నాయని తెలిపారు. గతంలో కోర్టు విచారణకు హాజరు కాకపోవడం వల్ల ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయని తెలిపారు. నవీన్‌యాదవ్‌పైనా ఎన్నికల ప్రచారంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలతో సహా పలు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరు, వీరి అనుచరులు పోలింగ్ రోజున గందరగోళం సృష్టించవచ్చని, ఓటర్లను బెదిరించవచ్చని, లేదా పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించవచ్చని బీఆర్‌ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల అధికారులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది.






