పోల్ మెనేజ్మెంట్ స్టార్ చేసిన BRS లీడర్స్.. అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు (వీడియో)

by Satheesh |   (  Updated:2023-12-15 16:37:04  IST  )

అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో రాష్ట్రంలో జోరుగా పోల్ మేనేజ్మెంట్ మొదలయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు డబ్బు, మద్యం, ఇతర తాయిలాల పంపిణీ కార్యక్రమానికి తెర

పోల్ మెనేజ్మెంట్ స్టార్ చేసిన BRS లీడర్స్..  అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో రాష్ట్రంలో జోరుగా పోల్ మేనేజ్మెంట్ మొదలయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు డబ్బు, మద్యం, ఇతర తాయిలాల పంపిణీ కార్యక్రమానికి తెర లేచింది. ఈ క్రమంలో జహీ‌రాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం గొటిగార్ పల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓటర్ల ఇంట్లోకి వెళ్లి రూ.500 పంచుతుండగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ టైమ్‌లో ఇక్కడికి ఎందుకు వచ్చారని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. తమ గ్రామానికి వచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచడం సరికాదన్నారు. ఐదు గంటలకు ప్రచారం ముగియగా.. ఇప్పుడు వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. ఇలా డబ్బులు పంచుతూ ఓటర్లను ఇంకా ఎన్ని రోజులు ప్రలోభ పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామం నుండి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.

Next Story