ఆర్టీసీ టికెట్ ధరలు తగ్గించాల్సిందే.. అక్టోబర్ 9వ తేదీన బీఆర్ఎస్ ‘ఛలో బస్ భవన్’

by Ramesh Naini |

పెంచిన ఆర్టీసీ బస్సుల ఛార్జీలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 9వ తేదీన “ఛలో బస్ భవన్” కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఆర్టీసీ టికెట్ ధరలు తగ్గించాల్సిందే.. అక్టోబర్ 9వ తేదీన బీఆర్ఎస్ ‘ఛలో బస్ భవన్’
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెంచిన టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల ఛార్జీలను వ్యతిరేకిస్తూ (BRS) బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 9వ తేదీన “ఛలో బస్ భవన్” (Chalo Bus Bhavan) కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ ప్రధాన నేతలు స్వయంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి బస్ భవన్ చేరుకోనున్నారు. నందినగర్ నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మెహదీపట్నం నుండి హరీశ్‌రావు (Harish Rao), మహేశ్వరం నుండి సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిలకలగూడ నుండి పద్మారావు గౌడ్, దిల్‌సుఖ్‌నగర్ నుండి సుధీర్ రెడ్డి, ఉప్పల్ నుండి లక్ష్మారెడ్డి, ముషీరాబాద్ నుండి ముఠా గోపాల్, మల్కాజిగిరి నుండి మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నుండి వివేకానంద్ గౌడ్, కూకట్‌పల్లి నుండి కృష్ణారావు బస్ భవన్ వైపు ప్రయాణించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) మీడియాకు వివరాలు వెల్లడంచారు. “సిటీ బస్సుల్లో బస్ భవన్ చేరుకుని, పెంచిన టికెట్ ధరలను తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి ప్రతిపాదన అందజేస్తాము” అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

Next Story