త్వరలోనే ఆ వివరాలన్నీ బయట పెడతాం.. BRS నేత సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

పంజాబ్ కాంగ్రెస్(Punjab Congress) నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu) గతంలో మంత్రి హోదాలో వచ్చి కేసీఆర్(KCR) ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీని ప్రశంసించారు.

త్వరలోనే ఆ వివరాలన్నీ బయట పెడతాం.. BRS నేత సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ కాంగ్రెస్(Punjab Congress) నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu) గతంలో మంత్రి హోదాలో వచ్చి కేసీఆర్(KCR) ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీని ప్రశంసించారు. తమ రాష్ట్రంలో కూడా ఈ తరహా పాలసీని ప్రవేశపెడతామన్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్(Manne Krishank) గుర్తుచేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ పాలనలో అక్రమ ఇసుక(Sand) దందా పెరిగింది.. కానీ రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని విమర్శించారు. కేసీఆర్ హయంలో తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీతో ప్రతీ ఏడాది రూ.800 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇసుక ఆదాయం ఏడాదికి రూ.19 కోట్లు కూడా దాటేది కాదని గుర్తుచేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఇసుక ఆదాయం సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి జేబులోకి వెళ్తోందని సంచలన ఆరోపణలు చేశారు. కొండల్ రెడ్డి(Kondal Reddy) ఇసుక మాఫియా(Sand Mafia)తో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Indlu)కు ఉచిత ఇసుక పేరుతో టన్నుల కొద్దీ ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీతో పాటు కొన్ని ప్రాజెక్టుల దగ్గర నీళ్లు ఖాళీ చేసి మరీ ఇసుకను తరలిస్తున్నారు. అయినా ఆదాయాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని అన్నారు. అసలు ఆ ఆదాయం మొత్తం ఎక్కడికి వెళ్తోందని ప్రశ్నించారు. లారీల అసోసియేషన్ కూడా ఓవర్ లోడింగ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇసుకపై రివ్యూ చేస్తే అవినీతి తగ్గించడానికి అనుకున్నాం.. ఆయన సోదరుడికి హెల్ప్ చేయడానికే అని తర్వాత తెలిసిందని విమర్శించారు. 24 గంటల ఇసుక మైనింగ్ రేవంత్ రెడ్డి కుటుంబ ఆదాయం పెంచడానికే తప్ప, రాష్ట్ర ఆదాయం పెంచడానికి కాదని అన్నారు. మినరల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్‌కు ఈ ఏడాదిలో ఐదుగురు ఎండీలు మారారు.. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి జరిగిన ఇసుక అమ్మకాలన్నీ బయట పెట్టాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో బీఆర్ఎస్(BRS) ఈ అంశాన్ని లేవనెత్తుతుందని.. స్పీకర్ సమక్షంలో ఇసుక రికార్డులన్నీ బయట పెట్టాలని అన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చాక రూ.200 కోట్ల మేర ప్రభుత్వానికి ఇసుక ఆదాయం తగ్గింది. ఇసుక మీద ఎనిమిది వందల కోట్ల రూపాయల టార్గెట్ కోసం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కేసీఆర్ హయంలో ఇసుకపై పదేండ్లలో 5900 కోట్ల ఆదాయం వచ్చింది. అపుడు ఉదయం 6 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే ఇసుక మైనింగ్ జరిగేది. రేవంత్ రెడ్డి ఇసుక అక్రమ దందాలపై మరిన్ని వివరాలు త్వరలోనే బయట పెడతామని క్రిశాంక్ సంచలన ప్రకటన చేశారు.

Next Story