తెలంగాణ రైతుల ఎరువుల కొరత తీర్చండి : కేంద్రమంత్రికి BRS లీడర్ల రిక్వెస్ట్

by Muthe.Rajitha |

తెలంగాణలో నెలకొన్న ఎరువుల కొరత గురించి కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.

తెలంగాణ రైతుల ఎరువుల కొరత తీర్చండి : కేంద్రమంత్రికి BRS లీడర్ల రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో నెలకొన్న ఎరువుల కొరత గురించి కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. వానలు విస్తారంగా పడి వరి నాట్లు వేస్తున్న కీలక సమయంలో రాష్ట్రంలో ఎరువుల కొరత కారణంగా రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను సంబంధిత శాఖల కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, చౌహాన్ జే.పీ.నడ్డాలను కలిసి వివరిస్తామన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మంగళవారం ఎంపీ రవిచంద్ర, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ లతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

ఎంపీ రవిచంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎరువుల కొరత ఏనాడు కూడా చోటుచేసుకోలేదని, సీజనుకు ముందే సమృద్ధిగా అందుబాటులో ఉంచేవారని వివరించారు. అందుకు భిన్నంగా ఇప్పుడు రైతులు గంటల తరబడి క్యూలైనులో నిలబడి కండ్లు కాచేలా ఎదురుచూసినా కూడా దొరకడం లేదని ఆవేదన చెందారు. ఈ విధమైన రైతుల దుర్భర పరిస్థితుల్ని పార్లమెంట్ దృష్టికి తీసుకువద్దామంటే సమావేశాలు సజావుగా జరగడంలేదన్నారు.ఈ విషయంలో వ్యవసాయ మంత్రి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఎరువుల,రసాయనాల శాఖల మంత్రి జే.పీ.నడ్డాలను తమ పార్టీ ఎంపీలు కలిసి సమస్య తీవ్రతను వివరిస్తామన్నారు.

Next Story