కేసీఆర్ నోట మళ్లీ ‘టీఆర్ఎస్’ మాట

by Ramesh Naini |   (  Updated:2025-12-21 15:26:44  IST  )

కేసీఆర్ నోట మళ్లీ ‘టీఆర్ఎస్’ మాట

కేసీఆర్ నోట మళ్లీ ‘టీఆర్ఎస్’ మాట
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్ అని ప్రస్తావించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన టీఆర్ఎస్ అంటూ పాత పేరుతో వ్యాఖ్యలు చేశారు. దీంతో పొరపాటున అన్నారా..? లేదా కావాలనే అన్నారా? రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇవాళ మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం, టీఆర్ఎస్ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, మిగతా పార్టీ కీలక నేతలతో కలిసి సమావేశం పెట్టుకున్నామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ద్రోహం చేస్తున్నాయని కేసీఆర్ అన్నారు. సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత దారుణమైన వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్‌నగర్ అని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపం అని కేసీఆర్ అన్నారు. కృష్ణా నది పారేదే మహబూబ్‌నగర్ జిల్లా నుంచి అని పేర్కొన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పాలమూరుకు తిరిగి కోలుకోలేని దెబ్బ కొట్టాయన్నారు. వీడియో

Next Story