KCR : కేసీఆర్ తో సమావేశం అయిన బీఆర్ఎస్ నేతలు

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS Cheif KCR) తో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు.

KCR : కేసీఆర్ తో సమావేశం అయిన బీఆర్ఎస్ నేతలు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS Cheif KCR) తో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. గజ్వేల్ లోఎర్రవల్లిలోని ఆయన ఫాంహౌసులో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో(Warangal Leaders) కీలక భేటీ నిర్వహించారు. ఏప్రిల్ 27న వరంగల్ లో జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు(BRS Silver jubli Celebrations) ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ఏర్పాట్లు, నిర్వహణ, జన సమీకరణ వంటి అంశాలపై కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story