- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vinod Kumar: ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలి
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలని.. మహారాష్ట్రలోని లాతూర్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం సందర్బంగా ఇచ్చిన ఉద్యోగ ప్యాకేజీని కాజీపేట భూ నిర్వాసితులకు అమలు చేయాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలని.. మహారాష్ట్రలోని లాతూర్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం సందర్బంగా ఇచ్చిన ఉద్యోగ ప్యాకేజీని కాజీపేట భూ నిర్వాసితులకు అమలు చేయాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. వినోద్‌కుమార్ నాయకత్వంలోని బీఆర్ఎస్ బృందం సోమవారం సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాస్తవను కలిశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. కాజీపేటలో ఏర్పాటైంది రైల్వే కోచ్ ఫ్యాక్టరీయేనని జీఎం స్పష్టత ఇచ్చారని తెలిపారు. జిల్లాలో పలుచోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతోపాటు మరికొన్ని అంశాలను జీఎం దృష్టికి వారు తెచ్చారు. ఈ అంశాలపై రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ధాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.






