మేడిగడ్డ సందర్శనకు బయల్దేరిన బీఆర్ఎస్ నేతలు

by Disha Web Desk 4 |
మేడిగడ్డ సందర్శనకు బయల్దేరిన బీఆర్ఎస్ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ నేతలు కాసేపటి క్రితం బయల్దేరి వెళ్లారు. తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు బయలుదేరారు. కేసీఆర్ మినహా మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. తొలుత మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత అన్నారం బ్యారేజీని బీఆర్ఎస్ నేతలు పరిశీలించనున్నారు. అన్నారం వద్ద బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. కాంగ్రెస్-బీజేపీ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎండగట్టి.. ప్రజలకు వాస్తవాలు తెలుపుతామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు తెలిపారు. వాస్తవాలు ప్రజలకు తెలిపేందుకు చలో మేడిగడ్డకు వెళ్తున్నట్లు సందర్శనకు వెళ్లేముందు మీడియాతో కేటీఆర్ అన్నారు.

Read More : కల్వకుంట్ల కన్స్‌ట్రక్షన్స్ సమర్పణలో ‘మేడిగడ్డ’..పోస్టర్ రిలీజ్ చేసిన T- కాంగ్రెస్

BREAKING: బాధ్యతను మరిచి కాంగ్రెస్ రాజకీయలు చేస్తోంది: మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు


Next Story