కల్వకుంట్ల కన్స్‌ట్రక్షన్స్ సమర్పణలో ‘మేడిగడ్డ’.. పోస్టర్ రిలీజ్ చేసిన T- కాంగ్రెస్

by Disha Web Desk 4 |
కల్వకుంట్ల కన్స్‌ట్రక్షన్స్ సమర్పణలో  ‘మేడిగడ్డ’.. పోస్టర్ రిలీజ్ చేసిన T- కాంగ్రెస్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. బీఆర్ఎస్ నేడు ‘చలో మేడిగడ్డ’కు పిలుపు ఇవ్వగా.. కాంగ్రెస్ ‘చలో పాలమూరు’కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా టీ-కాంగ్రెస్ కేటీఆర్, కేసీఆర్ లు ఉన్న ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీనికి కల్వకుంట్ల కన్స్‌ట్రక్షన్స్.. ‘మేడిగడ్డ’ అనే టైటిల్ పెట్టింది. ‘బాగా మేశినవ్ బిడ్డా..!!’ అనే క్యాప్షన్ ఇచ్చింది.

‘మేత మేసిన మేడిపండ్లన్ని మేడిగడ్డకు బయల్దేరినయ్..!! కాగ్‌కు ఏం తెలుసు కాకరకాయ. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులకేం తెలుసు అరటికాయ.. అన్ని బీఆర్ఎస్ బిల్డప్ బాబాయ్ లకే తెలుసు. అసలే వాళ్ళ నేత 80,000 పైగా పుస్తకాలు చదివిండాయె. ఇప్పుడు ఆ బ్రహ్మ జ్ఞానంతో ఇక్కడ బ్రహ్మాండం చెయ్యబోతున్నారు. ఆ బ్రహ్మాండమెందయ్య అంటే.. ఎక్కడో ఒక చోట కూల్ గా సెల్ఫీ తీసుకొని కూలలేదు, కుంగలేదు అంటే అయిపాయె. సిగ్గుండాలే బీఆర్ఎస్.. అదే ఉంటే అందరితో వచ్చేది. అది లేకనే ఇలా దొంగల్లా వచ్చింది.’ అంటూ ట్విట్టర్‌లో కామెంట్ చేసింది.


Next Story