కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు: మాజీ MP

by Gantepaka Srikanth |

మేడిగడ్డ మరమ్మతులకు కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్(BRS) నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Vinod Kumar) పేర్కొన్నారు.

కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు: మాజీ MP
X

దిశ, వెబ్‌డెస్క్: మేడిగడ్డ మరమ్మతులకు కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్(BRS) నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Vinod Kumar) పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీళ్లు నింపాలని అన్నారు. కాళేశ్వరం కమిషన్ ఏం అడిగినా చెప్పేందుకు కేసీఆర్(KCR) సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. కవిత వ్యాఖ్యలపై ఇప్పటికే కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. అందరూ స్పందించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్, బీజేపీలో లాగా బీఆర్ఎస్ వర్గాలు ఏం లేవు. అందరం కలిసిగట్టుగానే ఉన్నట్లు చెప్పారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని తెలిపారు.

మరోవైపు కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) విచారణకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో కమిషన్ విచారణకు హాజరవుతారా? లేదా? అన్న సందిగ్ధత వీడింది. వచ్చేనెల 5న విచారణకు హాజరుకావాలని ఇటీవల కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు జారీచేసింది. ఆయనతోపాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు సైతం నోటీసులు పంపించింది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ నోటీసులపై పూర్తిస్థాయిలో స్టడీ చేసిన కేసీఆర్.. విచారణకు హాజరవ్వాలనే డిసైడ్ అయ్యారు.

Next Story