GHMC లో డివిజన్ల పెంపుపై BRS నేతల ఫైర్

by Muthe.Rajitha |

జీహెచ్‌ఎంసీ డివిజన్ల పెంపుపై గులాబీ నేతలు ఫైర్ అయ్యారు.

GHMC లో డివిజన్ల పెంపుపై BRS నేతల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : జీహెచ్‌ఎంసీ డివిజన్ల పెంపుపై గులాబీ నేతలు ఫైర్ అయ్యారు. రేపు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో బీర్ఎస్ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు ఏకపక్షంగా 300 డివిజన్లు పెంచారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చామని అన్నారు. ప్రభుత్వానికి ఇంత తొందర ఎందుకని ప్రశ్నిస్తూ, డిసెంబర్‌ 16న జరిగే కౌన్సిల్‌లో తమ వాదనలు వినిపిస్తామని తెలిపారు.

ఫ్లెక్సీల విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ... ప్రభుత్వం ఇష్టానుసారంగా డివిజన్లు పెంచుతున్నారని విమర్శిస్తూ, రాజ్యాంగబద్ధంగా డెలిమిటేషన్ కమిషన్ ద్వారా ప్రక్రియ సాగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. డివిజన్ల పెంపులో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ గతంలో గ్రామీణ ప్రాంతంగా ఉండేదని, ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతోందని అన్నారు.

కీసర ప్రాంతం బంజారాహిల్స్‌లా ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం ఆశిస్తుందో అర్థం కావడం లేదన్నారు. మొత్తంగా జీహెచ్‌ఎంసీలో డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పైగా పెంచడం, ఫ్లెక్సీలు తొలగింపు, వివిధ ప్రాంతాల అభివృద్ధి అంశాలపై రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కౌన్సిల్ సమావేశంలో మేయర్ తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారాయి.

Next Story