రేపు బీఆర్ఎస్ నాయకుల 'ఛలో కన్నెపల్లి యాత్ర'

by Muthe.Rajitha |

బీఆర్ఎస్(BRS) నాయకులు ప్రభుత్వంపై మరో నిరసన కార్యక్రమానికి తెర లేపింది.

రేపు బీఆర్ఎస్ నాయకుల ఛలో కన్నెపల్లి యాత్ర
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) నాయకులు ప్రభుత్వంపై మరో నిరసన కార్యక్రమానికి తెర లేపింది. బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లోని ముఖ్య నాయకులు రేపు ఛలో కన్నెపల్లి యాత్ర(Chalo Kannepalli Yatra) చేపట్టనున్నారు. గులాబీ పార్టీ మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులంతా ఈ యాత్రలో పాల్గొననున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కన్నెపల్లి పంప్ హౌజుల ద్వారా నీళ్ళు ఎత్తిపోసి.. ప్రాజెక్టులు, రిజర్వేయర్లు, చెరువులు నింపాలని గులాబీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త పాదయాత్రలు చేయడానికి కూడా వెనుకాడబోమని పేర్కొన్నారు.

Next Story