- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: ఛత్తీస్‌గఢ్‌తో జరిగింది అంగీకారం మాత్రమే.. ఏదో సాధించినట్లు డబ్బా వద్దు
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీద దుష్ప్రచారం చేయడం మానేసి ప్రాజెక్టుల పూర్తికి చిత్తశుద్ధితో పనిచేయాలి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీద దుష్ప్రచారం చేయడం మానేసి ప్రాజెక్టుల పూర్తికి చిత్తశుద్ధితో పనిచేయాలి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సమ్మక్కసారక్క బ్యారేజీకి మంత్రి ఉత్తమ్ అనుమతులు సాధించినట్టు చెప్పుకుంటున్నారని.. ఛత్తీస్‌గఢ్‌తో 50 ఎకరాల ముంపునకు సంబంధించి అంగీకారం కుదిరితే ఏవో గొప్పలు సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. బ్యారేజ్‌కు కొత్తగా అనుమతులు సాధించినట్టు డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి అప్పట్లో చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని.. రూ.811 కోట్ల వ్యయంతో అప్పట్లో దేవాదులకు జీవో ఇచ్చారని అన్నారు. 2009లో గానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. 37 టీఎంసీల నీళ్లు కూడా కాంగ్రెస్ హయాంలో తోడలేదని పేర్కొన్నారు.
ఫుట్‌వాల్ సైతం సరిగా పెట్టకుండా దేవాదుల డిజైన్ చేశారని ఆరోపించారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించకుండా కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును సరిదిద్దారని చెప్పారు. ఏడు టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్కసారక్క బ్యారేజ్‌ను కేసీఆర్ నిర్మించారని.. సమ్మక్క బ్యారేజ్‌కు ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలతో సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేసీఆర్‌కు అనుమతులు దక్కకుండా చేశారని ఆరోపించారు. 50 ఎకరాలపై ఒప్పందం చేసుకుంటేనే కాంగ్రెస్ ఇంత ప్రచారం చేసుకుంటే.. ఎన్నో ప్రాజెక్టులు ఎంతో కష్టపడి సాధించిన కేసీఆర్ ఎంత ప్రచారం చేసుకోవాలని అన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు మొదలుపెట్టి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ సీజన్‌లో లక్షలాది క్యూసెక్కుల నీళ్లు పారినా మేడిగడ్డ పిల్లర్లు ఒక్క మిల్లిమీటర్ కూడా చెక్కు చెదరలేదని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు డి.వినయ్‌భాస్కర్, డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.






