- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vinod Kumar: రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త
కర్ణాటక ఆలమట్టి ఎత్తు పెంచాలని నిర్ణయం తీసుకుని రెండు రోజులు అవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక ఆలమట్టి ఎత్తు పెంచాలని నిర్ణయం తీసుకుని రెండు రోజులు అవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా స్పందించడం లేదని.. సుప్రీంకోర్టు స్టే పెండింగ్‌లో ఉండగానే కర్ణాటక తీసుకున్న నిర్ణయంపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని మాజీఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్ చేవారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కృష్ణా నదిలో నీటి చుక్కను వదులుకోబోమని ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి ఓ సమీక్ష సమావేశంలో చెప్పారని.. మరి కర్ణాటక అక్రమంగా ఆలమట్టి ఎత్తు పెంచుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. కర్ణాటకలో ఉన్నదీ కాంగ్రెస్ ప్రభుత్వమే అని.. కానీ రాష్ట్రానికి అన్యాయం చేసేందుకు సిద్ధం అయిందని ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు రెండు రోజుల క్రితం సమావేశాలు పెట్టుకున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కర్ణాటక నిర్ణయంపై స్పందించారని.. ఆలమట్టి ఎత్తు పెంచితే తమ రాష్ట్రంలోని రెండు జిల్లాలు సాంగ్లీ, కొల్హాపూర్ జిల్లాల్లో ముంపు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు.
ఎత్తు పెంపును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని అడ్డుకుని తీరుతామని ఫడ్నవీస్ హెచ్చరించారని చెప్పారు. కేసీఆర్‌పై ద్వేషం తప్ప రేవంత్‌రెడ్డికి కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం చేయాలని లేదని ఆరోపించారు. సీఎం ఇప్పటికైనా సుప్రీంకోర్టులో కర్ణాటకకు వ్యతిరేకంగా కంటెంప్ట్ పిటిషన్ వేయాలని.. ఆలమట్టి ఎత్తు పెరిగితే తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌కుమార్ మాట్లాడుతూ.. 299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు ఏపీకి అనే ఒప్పందం తెచ్చింది ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వమని.. కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ తరతరాలుగా తెలంగాణకు అన్యాయం చేసిందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు సి.కళ్యాణ్ రావు, లలితరెడ్డి పాల్గొన్నారు.






