- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాపాలన అంటే పోలీసులతో అరెస్టు చేయించడమా?
గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేశారని.. వారిని వెంటనే విడుదల చేయాలని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేశారని.. వారిని వెంటనే విడుదల చేయాలని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజాపాలన అంటే పోలిసులతో అరెస్టులు చేయించడమా అని ప్రశ్నించారు. గ్రూపు 1 అవకతవకలపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికెషన్లకే ఈ ప్రభుత్వం ఉద్యోగాలిచ్చి అబద్ధాలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాల భర్తీపై మాట తప్పారని తెలిపారు. వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ఒక్క జీవో సీఎం ఇవ్వలేదన్నారు. వాకిటి శ్రీహరికి మత్స్య శాఖ ఇచ్చి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. చేతివృత్తులకు కనీస గౌరవం లేకుండాపోయిందని పేర్కొన్నారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు చర్చించి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలకు జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. అలవి గాని హామీలతో కాంగ్రెస్ గత ఎన్నికల్లో ప్రజలను మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల అమల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ.. బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను వంచించడానికే కామారెడ్డిలో సభ పెడుతున్నారని అన్నారు. పోరాటాలను పోలీస్ కేసులతో ఆపలేరని హెచ్చరించారు.






