- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: చట్టం ముందు అందరూ సమానులే.. ‘పుష్ప-2’ టీమ్‌పై BRS నేత సీరియస్
అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ మృతిచెందగా.. బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప-2 చిత్రబృందంతో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు వరుగా కంప్లైంట్లు చేస్తున్నారు.
తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్(BRS) నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. ‘తొక్కిసలాటో రేవతి మృతిచెందడం బాధాకరం. ఈ ప్రాణనష్టానికి సంధ్య థియేటర్ యజమాన్యం, స్థానిక పోలీసులు ఇద్దరూ సమానంగా బాధ్యులు. పోలీసులు భద్రత అయినా ఏర్పాటు చేసి ఉండాలి.. లేకపోతే అక్కడ సంబురాలకు పర్మిషన్ అయినా నిరాకరించి ఉండాలి. చిత్రబృందం పర్యటన పెట్టుకున్నప్పుడు ముందస్తుగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఒక రకంగా ఈ ఘటనకు సినిమా హీరో కూడా కారణమే. చట్టం ముందు అందరూ సమానులే’ అని అన్నారు.
Deeply saddened by the death of Ms Revathi in the stampede #Pushpa2 Show at Sandhya 70MM theatre in #Hyderabad city yesterday. This is an avoidable tragedy. Both Sandhya theatre owner and local police are equally responsible for this tragic loss of life. Police should have… pic.twitter.com/sAlohLuaJx
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) December 5, 2024






