- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: BRS నేత వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీకొని వ్యక్తి మృతి
by Satheesh |
బీఆర్ఎస్ నేత, తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వేల్లి 44వ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తిని మేడ్చల్ పట్టణానికి చెందిన గౌర్ల నర్సింహులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో వంటేరు ప్రతాప్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. దీంతో చైర్మన్‌ను ఘటన స్థలం నుండి మరో కారులో పంపించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story






