ఇది కాంగ్రెస్‌కు దెబ్బే..! బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ మాజీ సర్పంచ్‌లు

by Bhanu |   (  Updated:2025-07-01 12:10:56  IST  )

కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని, రైతులు, గ్రామాలు, నిరుద్యోగులు, యువతతో చేసిన హామీలను అమలు చేయడంలో...

ఇది కాంగ్రెస్‌కు దెబ్బే..! బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ మాజీ సర్పంచ్‌లు
X

దిశ, దుగ్గొండి: కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని, రైతులు, గ్రామాలు, నిరుద్యోగులు, యువతతో చేసిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం దుగ్గొండి మండలం గిర్నిబావిలోని జీఆర్బీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దుగ్గొండి మండలం నాచినపల్లి, గుడి మహేశ్వరం గ్రామాలకు చెందిన 53 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, వారిని పెద్ది స్వయంగా ఆహ్వానించారు. మాజీ సర్పంచులు పెండ్యాల మమతా రాజు, అడప సుధాకర్ కూడా పార్టీలో చేరారు.

పెద్ది మాట్లాడుతూ, గత 19 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దుగ్గొండి మండల అభివృద్ధికి ఒక్క రూపాయి నిధిని కూడా తీసుకురాలేదని, బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు, రైతులు అభివృద్ధిని చూసారన్నారు. పల్లె ప్రగతి, రైతు నష్టపరిహారం, రుణమాఫీ, బోనస్ లాంటి పథకాలతో కోట్లాది రూపాయల సహాయాన్ని గత ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగా లేక ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని, కేవలం హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు.

"గ్రామాలకు నిధులు నిలిపేయడం, గత ప్రభుత్వ జీవోల ద్వారా వచ్చిన పనులను రద్దు చేయడం అభివృద్ధిని అడ్డుకునే చర్యలే. ఈ కాంగ్రెస్ నాయకులు ఎలాంటి హక్కుతో ఎన్నికల్లో ఓట్లు అడుగుతారో చెప్పాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరబోతోంది" అని సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


Next Story