- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీకు మావోయిస్టులు లేఖ రాయడం నిజం కాదా?.. సీతక్కకు మాజీ ఎంపీ ప్రశ్న
మంత్రి సీతక్క(Minister Seethakka)పై బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత(Maloth Kavitha) సీరియస్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి సీతక్క(Minister Seethakka)పై బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత(Maloth Kavitha) సీరియస్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆమె తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీతక్క నువ్వు ఆదివాసీ బిడ్డ అనే కార్డు వాడుకొని కేటీఆర్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు. ఎన్నికల ముందు స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా అమాయకంగా మొహం పెట్టుకొని ఓట్లు అడిగి.. గెలిచాక సీతక్క మొత్తం క్యారెక్టర్ మార్చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నువ్వు నిజంగా ఆదివాసీ బిడ్డవే అయితే జీవో 49 ఎందుకు రద్దు చేయడం లేదు’ అని ప్రశ్నించారు. ములుగు నియోజకవర్గంలో జరిగే అక్రమాలను చూపిన జర్నలిస్టును నీ అనుచరులతో కొట్టించలేదా? అని అడిగారు. నీ అనుచరుల ఒత్తిడి వల్ల ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రశ్నించే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోలేదా? అని అన్నారు. మీ అరాచకాలు చూసి పలుమార్లు మావోయిస్టులు(Maoists) లేఖ రాయడం నిజం కాదా? అని సీతక్కపై బీఆర్ఎస్ నాయకురాలు మాలోత్ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. ట్వీట్






