'రాస గుమ్మడి' సాంగ్ లాంచ్‌కు వేదిక ఖరారు చేసిన 'కొరియన్ కనకరాజు' మేకర్స్

by Pulgam srinivas |

'రాస గుమ్మడి' సాంగ్ను రేపు సాయంత్రం 4 గంటలకు అనంతపురంలోని 'వి మెగా థియేటర్'లో లాంచ్ చేయనున్నారు.

రాస గుమ్మడి సాంగ్ లాంచ్‌కు వేదిక ఖరారు చేసిన కొరియన్ కనకరాజు మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. రితిక నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రంలోని 'రాస గుమ్మడి' పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్, సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన తేదీ, వేదికను కూడా వెల్లడించారు. జూలై 19న సాయంత్రం 4 గంటలకు అనంతపురంలోని 'వి మెగా థియేటర్'లో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రముఖ హాస్యనటుడు సత్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా, ఇప్పుడు 'రాస గుమ్మడి' పాటతో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.




Next Story