- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ లాంచ్‌కు సమయం, వేదిక ఖరారు
'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్‌ను ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరి ప్రియా హీరోయిన్‌గా తెరకెక్కిన 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రం ట్రైలర్‌ను జూలై 18న అనగా ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్ (AAA Cinemas)లో ఘనంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, సాయి రాజేష్ మరియు ఎస్‌కేఎన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆర్.ఆర్. ధ్రువన్ సంగీతాన్ని అందిస్తున్నారు. జూలై 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.






