- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: పార్టీ అన్ని గమనిస్తోంది.. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత స్పందన
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల బీఆర్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల బీఆర్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి (Madhusudhana Chary) స్పందించారు. బీసీ రిజర్వేషన్లపై అర్డినెన్స్ తీసుకురావాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని, దీన్ని వ్యతిరేకించడం సరికాదంటూ (BRS) బీఆర్ఎస్ తీరును ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రెస్‌మీట్‌లో ఓ జర్నలిస్ట్ శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా మధుసూదనాచారి మీడియాతో మాట్లాడుతూ.. మేము బీఆర్ఎస్ స్టాండ్ ప్రకారమే బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతున్నామని అన్నారు. వారి మాటలను వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నాం.. వారు మాట్లాడే మాటలు పార్టీ స్టాండా? లేదా అనేది చెప్పాలి? అని అన్నారు. పార్టీ అన్ని గమనిస్తుంది.. పార్టీకి ఎవరూ అతీతులు కారని సమాధానం చెప్పారు.
శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్వేతపత్రాల సామ్రాట్ అని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. సీఎం అయ్యాక శ్వేతపత్రాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఆయన పరిపాలన చేస్తున్నారా? ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారా అర్థం కావడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను బలి ఇవ్వడానికి సీఎం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డి దాదాపు 200 రోజులు ఢిల్లీ, విదేశీ పర్యటనలకు వెళ్లారని తెలిపారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీకి వెళ్తే బొంకులు, హైదరాబాద్‌లో ఉంటే రంకులు అని తీవ్ర విమర్శలు చేశారు. అలాగే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ నుంచి పాలన చేయడంలేదని, ఆయన పరిపాలన తన ఇంటి నుంచి లేదా కమాండ్ కంట్రోల్ నుంచి చేస్తున్నారని అన్నారు. లోపాయికారీ వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు ఇంటి నుంచి ఆయన పరిపాలన చేస్తున్నారని తెలిపారు. హిడెన్ అజెండాతో కమాండ్ కంట్రోల్ నుంచి పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీకి వెళ్తే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో పెట్టి చట్టబద్ధత కల్పించాలని, 42 శాతం రిజర్వేషన్లు చట్ట బద్ధంగా కావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆర్డినెన్స్‌పై కన్ఫ్యూజన్‌లో ఉందన్నారు. సీఎం ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదన్నారు.






