- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: అసెంబ్లీ పవిత్రతను దిగజార్చేలా ప్రవర్తన
శాసనమండలి సమావేశాల జరిగిన తీరు అస్సలు బాలేదని.. కాంగ్రెస్ ద్రోహాలు, మోసాలను కప్పి పుచ్చుకునేందుకే సమావేశాలను వాడుకున్నదని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: శాసనమండలి సమావేశాల జరిగిన తీరు అస్సలు బాలేదని.. కాంగ్రెస్ ద్రోహాలు, మోసాలను కప్పి పుచ్చుకునేందుకే సమావేశాలను వాడుకున్నదని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యలు, హామీలపై చర్చ జరగకపోవడం బాధాకరమన్నారు. అసెంబ్లీ పవిత్రతను దిగజార్చేలా ఈ ప్రభుత్వం వ్యవహరించిందని పేర్కొన్నారు. గతంలో శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో ప్రజల సమస్యలపై అనేక చర్చలు జరిగేవని.. ఇప్పుడు ఆరు రోజుల మాత్రమే శాసనమండలి సమావేశాలను నిర్వహించారని తెలిపారు. మండలికి ఒకరిద్దరు మంత్రులు మాత్రమే హాజరు అయ్యారని.. శాసనసభలో టీ బ్రేక్ పేరుతో గంటలు గంటలు సభను వాయిదా వేశారని పేర్కొన్నారు. తాను స్పీకర్‌గా పనిచేసిన సందర్భంలో మినిట్ టు మినిట్ ప్రొసీడింగ్స్ ఉండేవన్నారు. ఢిల్లీ నుంచి సీఎం వచ్చేందుకు రెండు గంటలకు పైగా సభను వాయిదా వేశారన్నారు. అత్యంత కీలకమైన అంశాలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇస్తే వాటిని తిరస్కరించారని చెప్పారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తీరును ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి నిర్వాహకాల చిట్టా రోజురోజుకూ పెరుగుతున్నదని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకుడు ఎల్.రమణ, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి పాల్గొన్నారు.






