- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము సహకరిస్తాం.. బీఆర్ఎస్ నేత షాకింగ్ కామెంట్స్
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై బీఆర్ఎస్(BRS) శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి(Madhusudhana Chary) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై బీఆర్ఎస్(BRS) శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి(Madhusudhana Chary) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడారు. ద్రోహానికి, వంచనకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్(BC Declaration) పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలను మభ్యపెట్టిందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు, బీసీ సబ్ ప్లాన్ అంటూ కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రతిపాదించారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా.. ఇందులో ఏ ఒక్కటీ అమలు కాలేదని అన్నారు. బడ్జెట్‌లో పోయినసారి రూ.9 వేల కోట్లు కేటాయించారు.. అందులో సగం కూడా ఖర్చు చేయలేదని అన్నారు. ఈసారి బడ్జెట్‌లోనేమో రూ.11 వేల కోట్లు కేటాయించారు.. ఇప్పుడెం ఖర్చు చేస్తారో తెలియదు అని అనుమానం వ్యక్తం చేశారు.
కోర్టు చెబితే డెడికేటెడ్ కమిషన్ వేసి కులగణన చేశారు. అది కూడా తప్పుల తడకగా ఉంది. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళతా అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి విస్మరించారు. రాహుల్ గాంధీ కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే 42 శాతానికి చట్టబద్దత వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ఏ ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ సహకరిస్తుంది. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అవసరం లేదు అని మధుసూదనా చారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అప్పులు, తప్పులు రెండూ పెరిగాయి. అప్పుడు హైడ్రాతో విధ్వంసం.. ఇపుడు హెచ్ సీయూలో విధ్వంసం చేస్తున్నారు. మొన్ననమో లగచర్లలో రైతులపై దాడులు చేశారు. కేసీఆర్ హరిత హారం చేపడితే.. రేవంత్ రెడ్డి హరిత హననం చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
లంగ్ స్పేస్‌గా పని చేస్తున్న హెచ్‌సీయూ భూములను ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దని ప్రభుత్వానికి సూచించారు. కేసీఆర్ హయాంలో అటవీ విస్తీర్ణం ఏడు శాతానికిపైగా పెరిగితే.. రేవంత్ దాన్ని తగ్గించాలని చూస్తున్నారని ఆరోపించారు. హెచ్‌సీయూ భూములపై విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.






