Madhusudhana Chary: దిక్కుతోచని సీఎం రేవంత్‌రెడ్డి

by Gantepaka Srikanth |

రిజర్వేషన్లపై 50శాతం పరిమితి విధించింది సప్రీంకోర్టు అయితే.. పార్లమెంట్‌లో పరిమితిని ఎత్తివేసే చర్యలు చేపట్టకుండా సుదీర్ఘకాలం ద్రోహం చేసిందే కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీమంత్రి జోగు రామన్న ప్రకటనలో దుయ్యబట్టారు.

Madhusudhana Chary: దిక్కుతోచని సీఎం రేవంత్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రిజర్వేషన్లపై 50శాతం పరిమితి విధించింది సప్రీంకోర్టు అయితే.. పార్లమెంట్‌లో పరిమితిని ఎత్తివేసే చర్యలు చేపట్టకుండా సుదీర్ఘకాలం ద్రోహం చేసిందే కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీమంత్రి జోగు రామన్న ప్రకటనలో దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల హామీ మోసం బట్టబయలు కావడంతో, దిక్కుతోచని సీఎం రేవంత్‌రెడ్డి దిగజారి గత ప్రభుత్వంపై నిందలేస్తుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పాపన్న విగ్రహ ప్రతిష్ఠ భూమి పూజా కార్యక్రమంలో సీఎం బీసీ రిజర్వేషన్ల చట్టంపై నోటికొచ్చినట్లుగా అసత్యాలు వల్లించారని పేర్కొన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చట్ట, న్యాయపర ప్రయత్నాలు ఎన్నో చేసిందని.. చివరకు ప్రధాని నరేంద్ర మోదీని సైతం కేసీఆర్ కలిసి రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. హైదరాబాద్‌లో హంగామా, ఢిల్లీలో డ్రామా తప్ప కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల అంశంలో సాధించిందేమీ లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా మోసపూరిత వైఖరి మానుకొని, బీసీలతో చెలగాటం ఆపేయాలని సూచించారు.

Next Story