‘ఆ మాట కేసీఆర్ ఎప్పుడూ చెబుతుండేవారు’.. KTR ఆసక్తికర ట్వీట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-02 04:43:31  IST  )

బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు.

‘ఆ మాట కేసీఆర్ ఎప్పుడూ చెబుతుండేవారు’.. KTR ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్‌: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. సామాన్యుడి సమస్యలు తీర్చినప్పుడే టెక్నాలజీకి సార్థకత అని కేసీఆర్(KCR) మాకు ఎప్పుడూ చెబుతుండేవారని గుర్తుచేశారు.

‘తెలంగాణ యువతలో సృజనాత్మకతను వెలికితీసి, వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సదాశయంతో టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ వంటి సంస్థలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది. అయితే, టీహబ్ నుండి సహకారంతో, న్యాయం కోసం పడిగాపులు కాస్తున్న వారికి ఓ తెలంగాణ యువకుడు అండగా నిలిచాడు. CLNS అనే మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా ఒక్క రూపాయికే న్యాయ సలహాలు అందిస్తున్నాడు. దేశవ్యాప్తంగా సేవలు అందిస్తూ కందిక ఆదర్శ్‌ నల్లకోటు విలువ పెంచుతున్నాడు. వారికి అభినందనలు. ఆదర్శ్‌ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను’ అని కేటీఆర్ ఎక్స్ వేదికగా అభినందించారు.

Next Story