ఫేక్ కాదు.. అవన్నీ నిజాలే.. BRS నేత సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)లో విద్యార్థుల ఆందోళనల వేళ బీఆర్ఎస్(BRS) సోషల్ మీడియా వింగ్‌కు సంబంధించిన నేతలు ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

ఫేక్ కాదు.. అవన్నీ నిజాలే.. BRS నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)లో విద్యార్థుల ఆందోళనల వేళ బీఆర్ఎస్(BRS) సోషల్ మీడియా వింగ్‌కు సంబంధించిన నేతలు ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌(Manne Krishank)కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. HCU అంశంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సర్క్యూలేట్ చేశారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా ఈ నోటీసులపై క్రిశాంక్ స్పందించారు. కాంగ్రెస్(Congress Govt) డ్యామేజ్ కంట్రోల్ చేయడం ప్రారంభించిందని విమర్శించారు. తాము ఏఐ(Artificial intelligence)ని ఎక్కడా వాడలేదని స్పష్టం చేశారు. ఇటీవల HCUలో విడుదల చేసిన ఫొటోలు, వీడియోలు అన్నీ వాస్తవమే అని చెప్పారు. కేసులను తాము కూడా లీగల్‌గా ఎదుర్కొంటామని అన్నారు.

జింకలు(Deers) రోడ్ల మీద తిరగడం, స్థానికుల ఇళ్లలోకి వెళ్లే వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అక్కడ జింకలు లేవు, అక్కడ నక్కలు ఉన్నాయని అన్నారు. ఎవరూ అక్కడికి వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు. ఇక్కడే ఎవరు భయపడున్నారో తెలిసిపోతుందని అన్నారు. ఏఐ(Artificial intelligence)తో తాము వీడియోలు క్రియేట్ చేశామని అనడం పచ్చి అబద్ధం, అసలు ఏఐ గురించి మాట్లాడే అర్హత కూడా కాంగ్రెస్‌కు లేదని మండిపడ్డారు. ప్రభుత్వమే మనిషికి రూ.20 వేలు ఇచ్చి సోషల్ మీడియాలో రీల్స్ చేయిస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు.

Next Story